నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకురావడానికి అత్యాధునిక డిజిటల్ ప్లాట్‌ఫారమ్ అయిన స్కిల్ ఇండియా డిజిటల్‌ను కేంద్ర విద్య మరియు నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బుధవారం ప్రారంభించారు. టెక్నాలజీలో భారతదేశం యొక్క నైపుణ్యం గురించి ప్రధాన్ మాట్లాడుతూ, డిజిటల్ టెక్నాలజీలో భారత్ ప్రపంచానికి అగ్రగామిగా ఉందని అన్నారు. భారతదేశ జనాభా డివిడెండ్, ఆర్థిక వృద్ధికి సాధనంగా నైపుణ్యం, వ్యవస్థాపకత మరియు ప్రభుత్వం చేపట్టిన ఇతర డిజిటల్ కార్యక్రమాల గురించి కూడా మంత్రి తెలిపారు.