ఈ నెల 30న ఏపీ రెవెన్యూ భవన్లో రాష్ట్ర కార్యవర్గ ఎన్నిక జరుగనుంది. మొత్తం 30 పోస్టులకు ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎన్నికల అధికారి పీవీ కృష్ణారావు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ సందర్భంగా మచిలీపట్నంలో రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ.. గత 60 యేళ్లుగా వస్తున్న సాంప్రదాయం ప్రకారం ఎన్నిక నిర్వహణ తేదీ మరుసటి రోజు రాష్ట్ర కౌన్సిల్ సమావేశం ఉంటుందన్నారు. అక్టోబర్ 1న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 17వ కౌన్సిల్ సమావేశం ఉంటుందన్నారు. సెప్టెంబర్ 30 ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ జరుగుందున్నారు. ఎన్నిక అనివార్యమైతే 4 గంటల తర్వాత పోలింగ్ ఉంటుందని తెలిపారు.