స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ని అరెస్ట్ చేసిన విషయంలో కేంద్ర రక్షణ మంత్రితో నేడు ఎంపీ రఘురామ కృష్ణరాజు భేటీ అయ్యారు. ఇప్పటి వరకూ చంద్రబాబు అరెస్ట్‌పై బీజేపీ పెద్దలు స్పందించలేదు. ప్రస్తుతం ఏపీలో బీజేపీ అండదండలతోనే చంద్రబాబును జగన్ అరెస్ట్ చేయించారన్న ప్రచారం జరుగుతోంది. ఇంకా స్పందించకుంటే ఏపీలో పార్టీ పరిస్థితి మరింత అధ్వాన్నమై పోతుందని రాష్ట్ర నేతలు అధిష్టానానికి చెప్పినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇక చంద్రబాబు అరెస్ట్‌పై బీజేపీ కూడా రంగంలోకి దిగాలని ఆయనని కోరారు.