హత్య కేసులో విచారణకు కోర్టుకు హాజరుకాకుండా తిరుగుతున్న నలుగురిపై న్యాయస్థానం జారీచేసిన నాన్ బెయిలబుల్ వారంటును చినగంజాం ఎస్సై సురేష్ గురువారం అమలు చేశారు. 2017 లో చినగంజాం పోలీస్ స్టేషన్లో నమోదైన హత్య కేసులు విశాఖకు చెందిన నలుగురు నిందితులుగా ఉండగా వారు కోర్టు వాయిదాలకు హాజరు కావడం లేదు. కోర్టు ఆదేశాలతో ఎస్సై సురేష్ ఆ నలుగురిని అరెస్టు చేసి హాజరు పరచగా మెజిస్ట్రేట్ రిమాండ్ విధించారు.