ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ఐఎండీ ప్రకారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని అల్పపీడనం ఇప్పుడు వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా-పశ్చిమబెంగాల్ తీరాల వద్ద మరింత బలపడింది. ఇది రానున్న రెండు రోజుల్లో ఒడిశా,ఛత్తీస్‌గఢ్ వైపుగా కదిలి తర్వాత బలహీన పడుతుంది. అల్పపీడనం కారణంగా రానున్న నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది అంటున్నారు.
అల్పపీడనం కారణంగా గంటలకు 40 నుంచి 45 కిమీల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అల్ప పీడనం ప్రభావంతో కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే ఈనెల 17వ తేదీ వరకు మృత్య్సకారుల చేపలవేటపై వెళ్లొద్దని వాతావరణశాఖ సూచించింది.