వైఎస్సార్ కాపు నేస్తం పథకం నాలుగో విడత నిధులను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. శనివారం తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో ఏర్పాటు చేసిన సభలో సీఎం వైఎస్ జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి 3,57,844 మంది లబ్దిదారుల ఖాతాల్లోకి రూ.15 వేల చొప్పున రూ.2,029 కోట్ల నగదును జమ చేశారు. కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన 45-60 ఏళ్లలోపు మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించేందుకు కాపు నేస్తం పథకాన్ని ప్రవేశపెట్టారు.