17 మంది బాలీవుడ్ సెలబ్రిటీలకు విచారణకు రావాలంటూ ఈడీ సమన్లు జారీ చేయడం కలకలం రేపింది. మహాదేవ్ గ్యాంబ్లింగ్ యాప్ యజమాని సౌరభ్ చంద్రశేఖర్ వివాహానికి హాజరైన వీరికి తాజాగా ఈడీ నోటీసులిచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో దుబాయిలో జరిగిన తన వివాహం కోసం సౌరభ్ రూ.200 కోట్లు ఖర్చు చేసినట్టు ఈడీ అధికారులు తెలుసుకున్నారు. అయితే ఆ సమయంలో బాలీవుడ్ సెలబ్రిటీలకు రూ.40 కోట్లు చెల్లించాడని ఈడీ ఆరోపణ. దీంతో వారికి నోటీసులు అందాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa