వైద్య విద్యార్థులకు సుప్రీంకోర్టు తీపి కబురు చెప్పింది. ఇంటర్న్‌షిప్‌లో ఉన్న ఎంబీబీఎస్ విద్యార్థులకు వైద్య కళాశాలలు స్టైపెండ్ తప్పనిసరిగా చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. జాతీయ వైద్య మండలి(ఎన్‌ఎంసీ) నిబంధనను వైద్య కళాశాలలన్నీ అమలు చేయాలని పేర్కొంది. ఢిల్లీలోని ఆర్మీ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు చెందిన విద్యార్థులు తమకు స్టైపెండ్ ఇవ్వడం లేదంటూ సుప్రీంను ఆశ్రయించగా ఈ మేరకు తీర్పునిచ్చింది.