నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పర్యావరణంపై ఇటీవల ఇచ్చిన ఓ తీర్పుపై కర్నూలు జిల్లా కాలుష్య నియంత్రణ మండలి సమన్వయంతో శుక్రవారం స్థానిక న్యాయ సేవా సదన్ భవన్‌లో అవగాహన సదస్సు ఏర్పాటు చేసారు. ఇందులో పాల్గొన్న కర్నూలు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సీహెచ్ వెంకట నాగ శ్రీనివాసరావు మాట్లాడుతూ..... తడి, పొడి చెత్తను వేరు చేసి డీ కంపోజ్ చేసుకుంటే పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చని అన్నారు. ఎలక్ర్టానిక్ వస్తువుల వ్యర్థాలను అనంతపురం, హైదరాబాదుకు పంపి డీ కంపోజ్ చేసుకోవచ్చని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకుగాను రాబోయే వినాయక చవితి రోజు మట్టి వినాయక విగ్రహాలను వాడాలని కోరుతూ ఒక వాల్‌పోస్టర్‌ను న్యాయమూర్తి విడుదల చేశారు.