దేశంలో క్లాడ్ 9 అనే పేరుతో వరిసెల్లా అనే చికెన్‌పాక్స్ కొత్త వేరియంట్‌ను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ కనుగొంది. వరిసెల్లా-జోస్టర్ వైరస్ (VZV)కి కారణమయ్యే వేరియంట్ దేశంలో మొదటిసారిగా కనుగొనబడింది. WHO ప్రకారం ఇది హెర్పెస్వైరస్ కుటుంబానికి చెందినది. ఇది పిల్లల్లో తేలికపాటి రుగ్మతలకు మాత్రమే దారితీస్తుందని, పెద్దలలో ఇది మరింత తీవ్రంగా ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.