హైకోర్టులో నేడు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ జరగనుంది. అలాగే ఏసీబీ కోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్‌పైనా విచారణ జరగనుంది. సీఐడీ వేసిన కస్టడీ పిటిషన్‌పైనా వాదనలు జరిగే అవకాశముంది. ఈ క్రమంలోనే చంద్రబాబు తరుఫున వాదించేందుకు ముగ్గురు సీనియర్ న్యాయవాదులు రంగంలోకి దిగనున్నారు. రిమాండ్ ఉత్తర్వులు సస్పెన్షన్‌పై సీఐడీ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముఖుల్ రోహత్గి వాదనలు వినిపించే అవకాశం ఉంది. సిద్ధార్థ లూథ్రాతో పాటు హరీష్ సాల్వే, సిద్ధార్థ అగర్వాల్ చంద్రబాబు తరుఫున వాదనలు వినిపించనున్నారు.