ఎన్నికలకు ఆరు నెలల కూడా లేని సమయంలో ప్రతిపక్షాలు లేకుండా ఎన్నికలకు వెళ్లాలని సీఎం జగన్ ప్లాన్ వేశారని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలు చేసేందుకు పోలీసు శాఖను పావుగా వాడుకుంటున్నారన్నారు. తమ రాజకీయకక్ష కోసం పోలీసులను వాడుకుంటారా? లోకేష్ అరెస్టుకు కూడా రంగం సిద్ధమైందంటూ పోలీసులే ఫీలర్లు వదిలి భయభ్రాంతులు సృష్టిస్తున్నారన్నారు. ప్రజలు పండుగ పూట దేవాలయాలకు వెళ్లి దేవుణ్ని దర్శనం చేసుకోవడానికి కూడా పర్మిషన్లు కావాలా అని ప్రశ్నించారు. ప్రశాంతమైన ఆంధ్రప్రదేశ్‌ను జగన్ మోహన్ రెడ్డి తన స్వార్ధం కోసం అల్లకల్లోలం చేస్తున్నారని.. ఇది సరైన పద్దతి కాదని అన్నారు.