పోలవరం ప్రాజెక్టు పనుల నాణ్యతను ఎప్పటికప్పుడు నిర్మాణ సంస్థ, వాప్కోస్, తమ క్వాలిటీ కంట్రోల్ విభాగాలు పర్యవేక్షిస్తూనే ఉన్నాయని రాష్ట్ర జలవనరుల శాఖ తెలిపింది. డిజైన్లను కేంద్ర జలవనరుల శాఖ ఆమోదించడంలో జాప్యమే ప్రస్తుత పరిస్థితికి కారణమని జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ ఈ నెల 11న కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. ప్రాజెక్టులో అత్యంత కీలకమైన హెడ్‌వర్క్స్ పనులను, డయాఫ్రం వాల్, గైడ్‌బండ్ మరమ్మతులు.. ఎగువ కాఫర్ డ్యాం సీపేజీ నివారణ పనులు, ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ (ఈసీఆర్‌ఎఫ్) డ్యాం నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు కేంద్ర సంస్థలు త్వరితగతిన డిజైన్లు ఖరారు చేసేలా చర్యలు చేపట్టాలని.. తక్షణమే నిపుణుల కమిటీని వేయాలని కోరారు.