వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రానున్న రెండు రోజుల్లో ఇది ఉత్తర ఒడిశా, దక్షిణ జార్ఖండ్ మీదుగా పయనించనుంది. అల్పపీడనం ప్రభావంతో సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తాలో అనేకచోట్ల, రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఉత్తర కోస్తాలో అక్కడక్కడా భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.