సీతానగరం మండలంలోని 35గ్రామ పంచాయతీలో నిర్వహిస్తున్న వినాయక చవితిపండుగ మండపాలపై పోలీస్ సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎస్ఐ నీలకంఠం మంగళవారం స్థానిక విలేకరులకు తెలిపారు. మండలంలోని 91 విగ్రహాలకు సంబందించి ఆయాగ్రామాల కమిటీ సభ్యులు పోలీస్ అనుమతులు తీసుకున్నట్లు తెలిపారు. తప్పనిసరిగా పోలీస్ నియమ నిబంధనలు పాటించాలని కోరారు. సచివాలయం పరిదిలో ఎంఎస్పిలు కూడా వీటిపై దృష్టి పెట్టారని తెలిపారు.