బుధవారం వెలగపూడి సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో ఐబీ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ విద్యావిధానాన్ని అమలు చేసేందుకు గాను ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎంఓయూపై సంతకాలు చేసిన ఐబీ చీఫ్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్. మన రాష్ట్రంలోని పిల్లలు విదేశాల్లో చదువుకునేందుకు కమ్యూనికేషన్ సమస్య తలెత్తకుండా ఉండేందుకు ఐబీ సంస్థతో ఎంవోయూ కుదుర్చుకున్నారు. 1వ తరగతి నుంచి క్రమంగా ఐబీని విస్తరిస్తామని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియాకు వివరించారు.