అనంతపురం జిల్లాను బాల్యవివాహాలు లేని జిల్లాగా తీర్చిదిద్దుదామని గుంతకల్లు ఆర్డీఓ రవీంద్ర పేర్కొన్నారు. గుంతకల్లు పట్టణంలోని వెలుగు కార్యాలయంలో డివిజనల్ లెవెల్ వర్క షాప్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.... బడి ఈడు పిల్లలు అందరూ బడిలో ఉండాలని ఏ ఒక్కరూ డ్రాపౌట్ అవ్వడానికి అవకాశం లేదన్నారు. బడి బయట ఉన్న పిల్లలను సీఆర్పీల చేత సర్వే చేయించి బడిలో చేర్పించాలన్నారు. బాల్య వివాహ నిరోధంపైన విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు.