చంద్రబాబును రాజమండ్రి జైల్లోనే చంపేందుకు ప్లాన్ చేస్తున్నారని నారా లోకేశ్ సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబుకు హాని తలపెట్టేలా ప్రభుత్వం కుట్ర చేస్తోందనే అనుమానాలు బలపడుతున్నాయన్నారు. "జైల్లో విపరీతమైన దోమలు ఉన్నాయని చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదు. జైల్లో రిమాండ్ ఖైదీ సత్యనారాయణ డెంగ్యూ బారినపడి మరణించాడు. బాబు గారికి ఇలాగే చేయాని సైకో కుతంత్రాలు అమలు చేస్తున్నారు." అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.