శాసనసభలో టీడీపీ నేతలపై స్పీకర్ తమ్మిననేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే సభా స్ధానాన్ని తెలుగుదేశం పార్టీ సభ్యులు చుట్టుముట్టారని, ఈ స్ధానాన్ని అగౌరవపరిచేలా కాగితాలు చించి వేశారని స్పీకర్ తమ్మిననేని సీతారాం అన్నారు. సభ స్ధానాన్ని అగౌరవ పరిచారని అందుకే సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ కారణంగా ముగ్గురు ఎమ్మెల్యేలను అసెంబ్లీ సెషన్ ముగిసే వరకూ సస్పెండ్ చేశారు. ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, శ్రీధర్ రెడ్డిలను ఈ సెషన్ ఆఖరి వరకూ సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరిచేలా మీసాలు మెలివేయడం, తొడలు చరచడం లాంటి వికృత చేష్టలు చేశారని మండిపడ్డారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇలాంటి చర్యలకు పాల్పడడంపై ఆయనకు.. సభకు హెచ్చరిక చేస్తున్నామన్నారు. బాలకృష్ణకు ఇది మొదటితప్పుగా భావించి ఆయనకు మొదటి హెచ్చరిక జారీ చేస్తున్నామని పేర్కొన్నారు.