అసెంబ్లీలో తెలుగు సినిమా కళాకారులను వైసీపీ ఎమ్మెల్యేలు ఘోరంగా అవమానించారని టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సినీ రంగం నుంచే ఎన్టీఆర్ అసెంబ్లీకి వెళ్లి ఎందరికో రాజకీయ భిక్ష పెట్టారని అన్నారు. మల్కాపురం గ్రామంలో టీడీపీ ఎమ్మెల్యేలు మీడియా సమావేశం బాలకృష్ణ మాట్లాడుతూ.. చంద్రబాబుపై పెట్టిన కేసు అక్రమమని, దీనిపై పోరాటం ఆపేది లేదన్నారు.