వినాయకుడి నిమజ్జనానికి ఊరేగింపుగా వెళ్తున్న సమయంలో చేతిలో టపాసులు పేలి ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. మదనపల్లె మండలం పొన్నేటిపాలెంలో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన సంతోష్(25) వినాయకుని నిమజ్జనానికి వెళ్లారు. ఊరి నుంచి దేవుణ్ణి ఊరేగిస్తున్న సమయంలో టపాసులు పేల్చారు. ఇది సంతోష్ చేతిలో పేలడంతో చేతి వేళ్లు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa