ఎలక్ట్రానింగ్ ఓటింగ్ యంత్రాల్లో (EVM) ఉపయోగించిన సాఫ్ట్ వేర్ ను ఆడిట్ చేయాలంటూ దాఖలైన పిటిషన్ ను తాజాగా సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఎక్కడా కూడా నిబంధనలు ఉల్లఘించినట్లు సరైన ఆధారాలు పిటిషనర్ చూపించలేదని ధర్మాసనం తెలిపింది. విచారణ అనంతరం ఈ పిల్ ను కొట్టివేస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ,జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం తెలిపింది.