ఏసీబీ కోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబుకు చుక్కెదురైంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయనను రెండు రోజుల పాటు సీఐడీ కస్టడీకి ఇస్తూ ఏసీబీ కోర్టు శుక్రవారం నిర్ణయం తీసుకుంది. విచారణ ఎక్కడ చేస్తారని సీఐడీని ఏసీబీ కోర్టు జడ్జి ప్రశ్నించారు. సీఐడీ వెంటనే జైలులోనే విచారిస్తామని తెలిపింది. చంద్రబాబును కస్టడీలోకి తీసుకోరని భావించిన టీడీపీ శ్రేణులకు నిరాశ ఎదురైంది.