మహిళా రిజర్వేషన్ బిల్లు మంచిదైనప్పటికీ దానిని ఎప్పట్నించి అమలు చేస్తారో కూడా చెపితే బాగుంటుందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ప్రతిపక్షాల డిమాండ్ల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కేంద్రం ఈ బిల్లు తీసుకువచ్చిందన్నారు. గతంలో చేసిన జనాభా గణాంకాల వివరాలను ప్రభుత్వం తక్షణం విడుదల చేయాలని, ఓబీసీలు, ఇతర బలహీన వర్గాల బనాభాను నిర్ధారించేందుకు తాజా కుల గణన చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు తమ పార్టీ పూర్తి మద్దతు ఉందని, అయితే ఏ తేదీ నాటికి అమలు చేస్తారనే విషయంలో మాత్రం ఎలాంటి స్పష్టత లేదని చెప్పారు.జనగణన, డీలిమిటేషన్ తొలగించి వెంటనే రిజర్వేషన్లు అమలు చేయాలని అయన సూచించారు.