యశ్వంతపుర - కాచిగూడ రైల్వేస్టేషన్‌ల మధ్య వందేభారత్ రైలు ట్రయల్‌రన్ గురువారం జరిపింది. కాచిగూడలో బయల్దేరిన ఈ రైలు మధ్యాహ్నం 1.15 గంటలకు యశ్వంతపుర రైల్వేస్టేషన్‌కు చేరుకుంది.ఈ రైలుకు ప్రధాని నరేంద్రమోదీ ఈనెల 24న ప్రారంభించే అవకాశం ఉన్నట్టు రైల్వే వర్గాలు వెల్లడించాయి. ఒకేరోజు 9 మార్గాల్లో వందేభారత్ రైళ్లను ప్రధాని వర్చువల్ ద్వారా ప్రారంభించనున్నారు. వందేభారత్ కాచిగూడ - యశ్వంతపురల మధ్య 610 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 8.30 గంటల్లో చేరుకుంది. మహబూబ్‌నగర్, కర్నూలు సిటీ, అనంతపురం, ధర్మవరం స్టేషన్‌లలో ఆగింది. ఇది ప్రతిరోజూ కాచిగూడ - యశ్వంతపురల మధ్య సంచరించనుంది. ఉదయం 5.30 గంటలకు కాచిగూడలో బయల్దేరి అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు చేరుకుంటుందని తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2.45కు బయల్దేరి అదే రోజు రాత్రి 11.15 గంటలకు కాచిగూడ చేరుకోనుంది. కాచిగూడ - యశ్వంతపురల మధ్య రైళ్ల ప్రయాణదూరం ప్రస్తుతం 12 గంటలుగా ఉంది. వందేభారత్ రైలుతో సమయం మూడున్నర గంటలు తగ్గుతుందని రైల్వే వర్గాలు అంటున్నాయి.