ఏపీ స్కిల్ డెవలెప్మెంట్ కేసులో అరెస్టైన మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది. సీఐడీ తరఫు లాయర్ల వాదనలతో ఏకీభవిస్తూ పిటిషన్ను కొట్టివేసింది. ఏకవాక్యంతో చంద్రబాబు క్వాష్ పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు తీర్పు వెల్లడించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్, దాని ఆధారంగా ఏసీబీ కోర్టు జారీ చేసిన రిమాండ్ ఉత్తర్వులను సవాలు చేస్తూ చంద్రబాబు క్వాష్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈనెల 19న ఈ పిటిషన్పై చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాదులు హరీశ్ సాల్వే, సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. సీఐడీ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. తాజాగా తీర్పును వెలువరించింది.