టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపడంపై ఉరవకొండ నియోజకవర్గ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. శనివారం పెన్నహోబిలం శ్రీ లక్ష్మి నరసింహస్వామి ఆలయం వద్ద చంద్రబాబు నాయుడు బయటకు రావాలని కోరుతూ టీడీపీ నాయకుడు మాళాపురం రాధాకృష్ణ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు 101 టెంకాయలు కొట్టారు. రాష్ట్రంలో ధృతరాష్ట్రుడి పాలన కొనసాగుతోందని జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ తెలిపారు.