పంజాబ్ లో దారుణం వెలుగుచూసింది. పాత కక్షలతో కపుర్తలాకు చెందిన హర్ దీప్ సింగ్ (22) అనే యువకున్ని కొందరు దుండగులు బుధవారం దారుణంగా చంపేసి తల్లిదండ్రుల కళ్ల ముందే ఇంటి ముందు పడేశారు. మీ కుమారున్ని చంపేశాం అంటూ కేకలు వేయగా తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు. ‘ఇదిగో మీ సింహం. ఇప్పుడు తీసుకువెళ్లండి’ అని హేళన చేయగా, బాధితుడి తండ్రి గురునామ్ సింగ్ ఫిర్యాదు మేరకు పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.