శాసనసభలో వైసీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న అరాచకాలు, దాడులను బయటకు రానివ్వకుండా, సభలో తెలుగుదేశం సభ్యులపై దాడులకు పాల్పడడం దారుణం అని శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా అయన మీడియా తో మాట్లాడుతూ.... చంద్రబాబుపై ప్రభుత్వం పెట్టిన ఒక్క కేసు కూడా నిలవదు. సీఎం జగన్రెడ్డి నియంత ధోరణికి రాష్ట్రం అతలాకుతలం అయిపోతోంది. రాజకీయ కక్ష్యతోనే చంద్రబాబుపై కేసు పెట్టారు. సుప్రీంకోర్టులో చంద్రబాబుకు న్యాయం జరుగుతుందని షరీఫ్ పేర్కొన్నారు.