మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తామని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం వ్యాఖ్యానించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సీఐడీ కస్టడీ పిటిషన్‌కు చంద్రబాబు భయపడరు. స్కిల్ డైవలప్మెంట్లో ఏం అవినీతి జరిగిందని సీఐడీ అధికారులు ప్రశ్నిస్తారు.. అసలు ఈ కేసులో అవినీతి ఏముంది. కేవలం రాజకీయ కక్ష సాధిపుతోనే అరెస్ట్ చేసారు. దీనిపై అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం అని తెలియజేసారు.