ఫైబర్ నెట్ కేసులో మాజీ ఐటీ మంత్రి లోకేశ్‌ను అరెస్టు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఏపీ సీఐడీ నుంచి ఒక బృందం, ఇంటెలిజెన్స్ నుంచి మరో బృందం ఐదు రోజులుగా మకాం వేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో ఆయన ఎవరెవరిని కలుస్తున్నారు? ఆయన్ను ఎవరు పరామర్శిస్తున్నారు? వంటి వివరాలను సీఐడీ, ఇంటెలిజెన్స్ బృందాలు రాబడుతున్నట్లు సమాచారం. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈ నెల 9న చంద్రబాబును అరెస్టు చేసిన తర్వాత లోకేశ్‌ను సైతం అరెస్టు అవుతారంటూ రాష్ట్ర మంత్రులు స్వయంగా మాట్లాడిన సంగతి తెలిసిందే.