అసెంబ్లీ సమావేశాలలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై తమ వాదనలు వినిపించాలనుకున్న బాలకృష్ణపై వైసీపీ సభ్యులు అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మంత్రి నారాయణస్వామి నీ బ్రతుకేంటో నాకు తెలుసు. బస్టాండ్లో పిక్ ప్యాకెట్ కొట్టే బతుకు నీది.. బాలకృష్ణను విమర్శించే స్థాయి నీకు లేదు.. మీకు దమ్ముంటే ప్రజల్లోకి వచ్చి బాలకృష్ణను విమర్శించాలి’’.. ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. గంట.. అరగంట మంత్రి అంబటి రాంబాబు... బాలకృష్ణవి పెట్టుడు మీసాలు కాదు దమ్మున్న మీసాలని బాలకృష్ణని విమర్శిస్తే తోలు తీస్తామని హెచ్చరించారు.