ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, అంతర్వేది ఆలయంలో టీడీపీ అధినేత చంద్రబాబు త్వరగా జైలు నుండి విడుదల కావాలంటూ శుక్రవారం రాష్ట్ర నాయీబ్రాహ్మణులు పూజలు నిర్వహించారు. నాయీబ్రాహ్మణ సంఘ సభ్యులంతా స్వామిని దర్శించుకుని చంద్రబాబు ఆయురారోగ్యాలతో ఉండాలని, రాష్ట్రం సుభిక్షింగా ఉండాలని, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు సీఎం కావాలని కోరుతూ పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో నాయీబ్రాహ్మణ సాధికార రాష్ట్ర సభ్యులు మానుకొండ దుర్గాప్రసాద్, సవిత సమాజం రాష్ట్ర కార్యదర్శి శంకరగుప్తం కొండబాబు, శంకరగుప్తం గోపి, శంకరగుప్తం నాని, ఇరగ వాడ సాయిబాబు, రాయి సుబ్రహ్మణ్యం, గూడపల్లి ప్రకాష్, మాచవరపు సూరిబాబు, ఇసుకపూడి ఏడుకొండలు, గూడపల్లి సత్తిబాబు, రామేశ్వరపు మాధవ పాల్గొన్నారు.