స్కిల్ స్కాం కేసులో ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసిన క్రమంలో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ చంద్రబాబు తరఫు న్యాయవాదులు సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. దీనిపై సోమవారం విచారణ చేపట్టే అవకాశం ఉంది. మరోవైపు, చంద్రబాబు సీఐడీ విచారణ కొనసాగుతోంది. అధికారుల బృందం ఆయన్ను ప్రశ్నిస్తోంది.