సరైన ప్రాతిపదిక లేకుండా లుక్ అవుట్ సర్క్యులర్(ఎల్వోసీ) జారీ చేసి ఓ వ్యక్తి విదేశాలకు వెళ్లడాన్ని అడ్డుకోలేరని ఢీల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఓ కేసు విషయంలో సెప్టెంబర్ 19న జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎల్వోసీ జారీ చేసే ముందు సదరు వ్యక్తి విదేశాలకు వెళ్లడం వలన దేశ భద్రత, సమగ్రతకు ఎదైనా భంగం కలుగుతుందా అనే విషయాలను ఎల్వోసీ జారీ చేసే అధికారులు పరిశీలించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.