విజయవాడ-చెన్నై వందేభారత్ రైలును ఆదివారం ఢిల్లీ నుంచి ప్రధాని మోదీ వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ రైలు విజయవాడలో సాయంత్రం 3.20 గంటలకు బయలుదేరి రేణిగుంట మీదుగా రాత్రి 10 గంటలకు చెన్నై చేరుకుంటుంది. చెన్నైలో ఉదయం 5.30 గంటలకు బయలుదేరి రేణిగుంట మీదుగానే మధ్యాహ్నం 12.10కి విజయవాడ చేరుకుంటుంది. మంగళవారం మినహా మిగిలిన ఆరు రోజులు ఈ వందేభారత్ రైలు సర్విసును నిర్వహిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa