స్కిల్ డెవలప్మెంట్ తరహాలోనే బైజుస్ కంటెంట్లో అవినీతి జరిగిందని, బైజుస్లో జరిగిన అవినీతిపై ఆధారాలు సేకరిస్తున్నామని.. త్వరలోనే కేసులు పెడుతామని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్అన్నారు. రాష్ట్రంలో పాలన గాలికి వదిలేసి... కక్ష సాధింపు రాజకీయాలు జరుగుతున్నాయని విమర్శించారు. 15 రోజులుగా ఎమ్మెల్యేలు, మంత్రులు వెకిలి మాటలు, వికృత చేష్టలతో ప్రజల దృష్టి మరల్చుతున్నారన్నారు. సీఎం కక్ష్య సాధింపులపై పెడుతున్న దృష్టి... వ్యవసాయం, రైతాంగం సమస్యలపై దృష్టి పెట్టడం లేదన్నారు. ఏడు సార్లు కరెంట్ చార్జీలు పెంచారని... కరెంట్ కోతలు పెరిగాయని మండిపడ్డారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో నిత్యావసరాల ధరలు ఉన్నాయన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులానే... వైసీపీ ప్రభుత్వ బైజుస్ అవినీతి కూడా బయటకు వస్తుందని చెప్పారు. ఉత్తుత్తి బటన్లు నొక్కుతూ... జనాన్ని మోసం చేస్తున్నారన్నారు.