తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, పెద్దపప్పురు మండలం తిమ్మనచెరువు లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద కళ్యాణమండపం పనుల భూమి పూజకు ఏర్పాట్లు చేశారు. హైకోర్టులో ఈ కార్యక్రమం పెండింగులో ఉందంటూ , పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. కానీ హైకోర్టు ఆదేశాలతోనే పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని జేసీ వర్గం చెపుతుంది. దీంతో పోలీసులు పెద్ద ఎత్తున జేసీ నివాసం వద్దకు చేరుకుని గృహనిర్బంధం చేశారు. పోలీసుల తీరుపై జేసీ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.