వ్యవస్థలను మేనేజ్ చేయడంలో సీఎం జగన్ దిట్ట అని జనసేన నేత కె.నాగబాబు వ్యాఖ్యానించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ మాటలు విని అధికారులు తప్పులు చేయొద్దు. తప్పులు చేసిన ప్రతి అధికారి భవిష్యత్తులో బాధ్యత వహించాల్సి ఉంటుంది. వైసీపీకి ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే రాష్ట్రం అథోగతి పాలైంది. మరోసారి ఛాన్స్ ఇస్తే ప్రజల ఆస్తులను లాక్కుంటారు. జనసేన, టీడీపీ కలిసి పని చేస్తేనే వైసీపీ దౌర్జన్య పాలన అంతం అవుతుందని నాగబాబు పేర్కొన్నారు.