శ్రీకాకుళం జిల్లా, హిరమండలం, అవలంగి గ్రామ సమీపంలో మూసివేసిన దాబాలో ఆదివారం పేకాట నిర్వహిస్తున్న విషయం తెలిసి ఎస్ఈబీ పోలీసులు, స్థానిక పోలీసులతో కలిసి దాడిచేశారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న 21 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.2.18 లక్షలు నగదు స్వాధీనం చేసుకుని కేసు నమో దు చేసినట్లు ఎస్ఐ నారాయణ స్వామి తెలిపారు.