వినాయక చవితి రోజు పూజ తర్వాత కొందరు ఇళ్లల్లో వినాయక ప్రతిమకు నిమజ్జనం చేయరు. ఇలా చేస్తే ఏదో జరిగిపోతుందనే భయం అవసరం లేదు. అయితే, విగ్రహ పరిమాణానికి సంబంధించి రోజూ నైవేద్యం సమర్పించాలి. సాధారణంగా బెల్లం, పంచదారతో నివేదించి సంతృప్త పరచలేరని, అందుకే నిమజ్జనం చేయాలని పండితులు సూచిస్తున్నారు. ‘గచ్ఛ గచ్ఛ సురశ్రేష్ఠ! స్వస్థాన పరమేశ్వర యత్ర బ్రహ్మాదయో దేవ! తత్ర గచ్ఛ గణాధిపా!!’ మంత్రం జపిస్తూ నిమజ్జనం చేయాలంటున్నారు.