భాద్రపద మాసంలో ప్రకృతి అంత పచ్చదనంతో నిండిపోయి కనిపిస్తుంది. గణపతి జన్మ నక్షత్రం అయిన బుధగ్రహానికి ఆకుపచ్చనివంటే చాల ఇష్టం. గణపతికి కూడా గడ్డిజాతి మొక్కలంటే చాలా ఇష్టం కనుక 21 గడ్డి జాతి మొక్కలను గణపతికి సమర్పించి పూజలు చేస్తారు. ఒండ్రుమట్టితో వినాయక ప్రతిమ కోసం జలాశయాలలో దిగి మట్టిని తీయడం వల్ల జలాశయంలో నీళ్లు తేటపడతాయి. జలాశయాల్లో మట్టిని తీసి దానితో బొమ్మను చేయడం వల్ల ఆ మట్టిలోని మంచి గుణాలు మన ఒంటికి పడతాయి. ఇది ప్రకృతి వైద్యం అని వైద్యులు చెబుతారు.