10 రోజుల పాటు పూజలు అందుకున్న గణపతి విగ్రహాన్ని 11వ రోజున జల నిమజ్జనం చేయడంలో ఒక వేదాంత రహస్యం ఉంది. పంచ భౌతికమైన ప్రతి ఒక్క పదార్థం, అంటే పంచభూతాల నుంచి జన్మించిన ప్రతి ఒక్క సజీవ, నిర్జీవ పదార్థమూ ఎంత వైభవంగా జీవితం గడిపినప్పటికీ అంతిమంగా మట్టిలో కలిసి పోవాల్సిందే. అందుకే ప్రకృతి దేవుడైన మట్టి గణపతిని చేసి వైభవంగా పూజలు చేసి ఊరేగించి చివరికి నీటిలో నిమజ్జనం చేస్తారు. ఎంత గొప్పగా బతికినా వారైన చివరికి మట్టిలో కలిసి పోవాల్సిందే అన్న ఒక్క సారాంశంతో నిమజ్జనం చేస్తారు.