ఇప్పటివరకు భూగోళంలో 7 ఖండాలు ఉండగా.. కొత్తగా 8వ ఖండాన్ని పరిశోధకులు కనుగొన్నారు. సుమారు 375 ఏండ్ల తర్వాత పరిశోధకులు కొత్త ఖండాన్ని కనుగొన్నారు. 2017లోనే వెలుగులోకి వచ్చిన ఈ ఖండం ఉనికిని తాజాగా శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఆక్లాండ్‌లో ఉన్న న్యూజిలాండ్ క్రౌన్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ జీఎన్‌ఎస్ సైన్స్ పరిశోధకులు కొత్త ఖండం(జిలాండియా) మ్యాప్‌ను విడుదల చేశారు. దీంతో 7 ఖండాలకు తోడు మరొకటి వచ్చి చేరడంతో ఖండాల సంఖ్య 8కి చేరే ఆస్కారం ఉంది.