జీపీఎస్ బిల్లును శాసనసభలో ఆమోదించడంపై ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగులు శ్రీకాకుళంలోని డేఅండ్‌నైట్ జంక్షన్ వద్ద బుధవారం రాత్రి యూటీఎఫ్ ఆధ్వర్యంలో జీపీఎస్ ప్రతులను దహనం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బుధవారం చీకటి రోజు అని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చౌదరి రవీంద్ర, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.అప్పారావు, ఎస్.కిషోర్‌కుమార్ పేర్కొన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా జీపీఎస్ బిల్లును ఆమోదించి.. వారి ఆశలను రాష్ట్ర ప్రభుత్వం చిదిమేసిందని ఆరోపించారు. ‘జీపీఎస్ వద్దని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఉపాధ్యాయులు ఉద్యోగులు పోరాటం చేస్తున్నా పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదు.భవిష్యత్‌లో జీపీఎస్ రద్దు కోసం పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. త్వరలో ఉద్యమ కార్యచరణ ప్రకటిస్తామన్నారు. ఓపీఎస్ సాధించేవరకూ పోరాడుతామని తెలిపారు.