పుంగనూరు బైపాస్ రోడ్డులో ఆగస్టు 4న జరిగిన అల్లర్ల కేసులో నియోజకవర్గానికి చెందిన పులిచెర్ల మండలంలోని ఆరుగురు టీడీపీ నాయకులు కడప జైలు నుంచి గురువారం సాయంత్రం బెయిల్ పై విడుదలైనట్లు వారి కుటుంబ సభ్యులు శుక్రవారం ఇందులో ధనంజయ నాయుడు, సర్దార్ భాష, మోహన్, గోపి నాయుడు, పురుషోత్తమ నాయుడు, జయచంద్ర నాయుడు ఉన్నారు. విడుదలైన తమ కుటుంబ సభ్యుల్ని చూడగానే వారి బంధువులు భావోద్వేగానికి లోనయ్యారు.