ఏపీ మాజీ సీఎం చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఫైబర్ గ్రిడ్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు తరపున ఆయన లాయర్లు హైకోర్టులో లంచ్మోషన్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కాగా స్కిల్ స్కామ్, ఫైబర్ గ్రిడ్ కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ నారా లోకేశ్ కూడా ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.