పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఘోరమైన సంఘటన జరిగింది. భీమవరం ఎస్పీ రవిప్రకాశ్ తెలిపిన వివరాల్లోకి వెళ్ళితే..... భీమవరం పట్టణంలోని 7వ వార్డు లెప్రసీ కాలనీలో నివాసం ఉంటున్న మావుళ్లు (28) భార్య ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్లింది. కుమారుడు, కుమార్తె హాస్టల్‌లో ఉండి చదువుతున్నారు. అతను చాలాకాలంగా ఒంటరిగా ఉంటున్నాడు. ఈ సమయంలో వరసకు సోదరుడైన కుమార్తె.. ఏడో తరగతి చదువుతున్న 12 ఏళ్ల బాలికపై కన్నేశాడు. మంగళవారం బాలిక తల్లిదండ్రులు పనిలోకి వెళ్లారు. మధ్యాహ్నం సెల్‌ఫోన్ రీచార్జ్ చేయించుకునేందుకు ఆమె బయటకు వెళుతుండగా తానే రీచార్జ్ చేస్తానని ఇంటి లోపలకు తీసుకుని వెళ్లాడు. బాబాయే పిలుస్తున్నాడని నమ్మకంతో వెళ్లిన ఆమెకు తన మనసులో మాట చెప్పాడు. భయంతో పరుగులు తీసేందుకు ప్రయత్నించగా ఆమె నోటిలో గుడ్డలు కుక్కి అత్యాచారం చేశాడు. అనంతరం ఆమె చున్నీతోనే గొంతు నులిమి చంపేశాడు. మృతదేహాన్ని భుజంపై వేసుకుని తన ఇంటి సమీపంలో పొలాల్లోకి తీసుకుని వెళ్లి పడేశాడు. సాయంత్రం కుమార్తె ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు గాలించారు. 27వ తేదీ సాయంత్రం వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 28వ తేదీ ఉదయం వారు నివాసం ఉంటున్న ఇంటి వెనుక వైపు కాలువ బోదెకు అవతల జమ్మి చేలో బాలిక మృతదేహాన్ని కనుగొన్నారు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మావుళ్లు భయంతో భీమవరం డిప్యూటీ డిప్యూటీ తహసీల్దార్ గ్రంధి నాగవెంకట పవన్‌కుమార్ ఎదుట లొంగిపోయినట్లు, శుక్రవారం అతన్ని అరెస్టు చేశామని ఎస్పీ తెలిపారు.