ఓపీఎస్ ఇవ్వకపోతే కనీసం సీపీఎ్‌సనే కొనసాగించాలని ఉద్యోగ, ఉపాధ్యాయులు కోరుతున్నా ప్రభుత్వం గ్యారంటీ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్) అమలు దిశగా ముందుకు వెళుతోందని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రొంగలి అప్పలరాజు ఆవేదన వ్యక్తం చేశారు. గత సంవత్సరం ‘చలో సీఎంఓ’ కార్యక్రమంతో సీపీఎస్ ఉద్యోగులకు ఎటువంటి సంబంధం లేకపోయినా, కావాలనే దొంగ కేసులు పెట్టించారని ఆయన ఆరోపించారు. కేసులు తొలగించకపోవడంతో ఉద్యోగులు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సీపీఎస్ ఉద్యోగులపై బనాయించిన పోలీస్ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేసారు.