పది, ఇంటర్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెగ్యులర్ విద్యార్థుల్లాగే వీరు కూడా పాఠశాల, కళాశాలలకు వెళ్లేందుకు అనుమతిస్తున్నట్లు వెల్లడించింది. అమ్మఒడి, విద్యా కానుక పథకాలతో పాటు మధ్యాహ్న భోజనం అందిస్తారని తెలిపింది. ఫెయిలైన విద్యార్థులు 2024లో అన్ని సబ్జెక్టులకు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఆయా సబ్జెక్టుల్లో గతంలో, ప్రస్తుతం వచ్చిన మార్కుల్లో ఏవి ఎక్కువ ఉంటే వాటినే తీసుకుంటారు.